వెల్లింగ్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భార్య అనుష్క శర్మలకు ఏ చిన్నపాటి విరామం దొరికినా దాన్ని విహార యాత్రకు కేటాయిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. కివీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా టెస్టు సిరీస్‌కు ఇంకా చాలా సమయం ఉన్నందున అనుష్క శర్మ.. న్యూజిలాండ్‌లో వాలిపోయారు. అదే సమయంలో కోహ్లితో కలిసి పుటారురులో ఉన్న బ్లూ స్ప్రింగ్స్ అందాలను తిలకించారు. దీనికి సంబంధించిన ఫోటోను మహ్మద్ షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ సమయంలో కోహ్లి-అనుష్క శర్మలతో షమీ, నవదీప్ సైనీలు వెంట ఉన్నారు.
క టీమిండియా సభ్యుల విహారానికి వెళ్లిన ఫోటోలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ‘బ్లూ స్ప్రింగ్ అందాలను క్రికెటర్లు తిలకించారు. ఇది భారత క్రికెటర్లకు చాలా సరదాను తీసుకొచ్చింది. టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా క్రికెటర్ల విరామం ఇది’ అని బీసీసీఐ పేర్కొంది.న్యూజిలాండ్ పర్యటనలో ఇప్పటివరకూ ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా పూర్తి చేసుకుంది. ఇందులో టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వైట్‌వాష్ అయ్యింది. కాగా, రెండు టెస్టుల సిరీస్‌కు చాలా విరామం ఉంది. ఫిబ్రవరి 21వ తేదీన వెల్లింగ్టన్‌లో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.