లాక్‌డౌన్‌: లడ్డు తయారుచేస్తున్న బాలీవుడ్‌ భామ

మలైకా అరోరా.. ఈ పేరు తెలియని వారుండరు. నాలుగు పదుల వయసులోనూ.. తన ఫిట్‌నెస్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందం, వర్కవుడ్‌, రూమర్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ నిత్యం వార్తల్లో నిలిచే ఈ బాలీవుడ్‌ భామ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాలంలో ఓ కొత్త విషయంతో ఆమె మరోసారి వార్తల్లోకెక్కారు. ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌తో సామాన్యులు  ఇబ్బందులు పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఈ కాలాన్ని తమకు నచ్చినట్టుగా ఉపయోగించుకుంటున్నారు. ఇంట్లో చేసే కొన్ని పనులను సోషల్‌ మీడియా రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. (సరదా కోసం కాదు.. ఇది మన బాధ్యత)



 


నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం ఇంట్లో పనులను తప్పని సరిగా చేస్తున్నారు. వంట చేయడం, వర్కవుట్‌లు, ఇంటిని శుభ్రపరచడం, నిద్రించడం, కుటుంబంతో గడపడం, ఇలాంటి పనులతోనే సరిపోతుంది. తాజాగా 46 ఏళ్ల మలైకా తన సమయాన్ని లడ్డులు తయారు చేయడానికి ఉపయోగించుకుంటుంది. బుధవారం ఇంట్లో తీరిగ్గా లడ్డుల తయారీ చేస్తూ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో మలైకా అభిమానులు కాస్తా నొచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ హట్‌ లుక్‌లో కనిపించే మలైకా ఇప్పుడు ఆంటీలాగా కనిపిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.